మేఘా ఆకాశ్ ‘సహాకుటుంబనాం’

- Advertisement -
Megha Akash in Sakutumbanama

కొత్త హీరో రామ్‌కిర‌ణ్‌ తో మేఘాఆకాశ్ నటిస్తోంది. ఆమె ఒప్పుకున్న మరో చిత్రం… “సహాకుటుంబనాం”. ఈ చిత్రం ప్రారంభోత్స‌వం ఆదివారం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జరిగింది. ఉద‌య్‌శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హెచ్‌.మ‌హాదేవ్ గౌడ‌, హెచ్‌.నాగ‌ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హీరో, హీరోయిన్‌ల‌పై చిత్రీక‌రించిన ముహుర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ కొరియోగాఫ్ర‌ర్ చిన్నిప్ర‌కాష్ కెమెరా స్విచ్చాన్ చేయ‌గా, ప్ర‌ముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం క్లాప్‌నిచ్చారు.

“ఈ చిత్రంలో త‌న పాత్ర గురించి విన‌గానే కొత్త హీరో అని చూడ‌కుండా మేఘా ఆకాష్ వెంట‌నే ఒప్పుకున్నారు. క్లీన్‌ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తీస్తున్నాం” అని అన్నారు దర్శకుడు.

“నా పాత్ర పేరు సిరి. నాకు బాగా న‌చ్చిన పాత్ర ఇది,” అని అన్నారు మేఘా ఆకాష్. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

 

More

Related Stories