కన్నడ హీరో, అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా హఠాత్తుగా కన్నుమూసిన సంగతి తెలిసిం. 39 ఏళ్ల చిన్న వయసులో చిరంజీవి హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. దీంతో అతడ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ మేఘనా రాజ్ తేరుకోలేకపోయింది. అలా కొన్ని రోజులుగా షాక్ లో ఉన్న మేఘనా, తన భర్తపై తాజాగా సోషల్ మీడియాలో స్పందించింది.
తన ఊపిరి ఉన్నంత వరకు చిరంజీవి బతికే ఉంటాడని, ఐ లవ్య్యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది మేఘన. చిరు అంటే ఎంతిష్టమో చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించానని, కానీ తన మనసులో భావాలను అక్షరాలుగా మలచలేకపోయానని చెప్పుకొచ్చిన మేఘనా.. ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, భర్త, కొడుకు, అంతరంగికుడు.. వీటన్నింటికంటే చిరంజీవి చాలా ఎక్కువది రాసుకొచ్చింది.
తలుపు వైపు చూసిన ప్రతిసారి చిరంజీవి లేడని, ఇక రాడనే బాధ తనను నలిపేస్తోందని.. తనను తాకలేకపోతున్నాననే బాధ ప్రతి క్షణం వేధిస్తోందని.. వెయ్యి మరణాల్ని చూసినంత బాధ కలుగుతోందని మేఘనారాజ్ తన ఆవేదనను వ్యక్తంచేసింది.
ప్రస్తుతం ఈమె 3 నెలల గర్భవతి. చనిపోయిన భర్తే కొడుకుగా పుట్టాలని ఆమె మనసారా కోరుకుంటోంది.