మళ్ళీ మేకప్ వేసుకున్న చిరంజీవి భార్య


కన్నడ హీరో చిరంజీవి సర్జా గతేడాది గుండెపోటుతో మరణించారు. చాలా యంగ్ ఏజులోనే అతను మరణించడం అందర్నీ కలిచివేసింది. హీరోగా కన్నడ పరిశ్రమలో బాగా ఎదుగుతున్న టైంలో కన్నుమూశారు చిరంజీవి. ఆయన భార్య మేఘన కూడా ప్రముఖ హీరోయిన్. భర్త చనిపోయిన టైంలో ఆమె గర్భవతి. ఇటీవలే ఆమెకి ఒక బాబు జన్మించాడు. తన కొడుకుని ఆమె జూనియర్ సి అని పిలుస్తుంటారు.

జూనియర్ సికి ఇప్పుడు 9 నెలలు. బాధని దిగమింగుకొని మళ్ళీ కెమెరా ముందుకొచ్చారు మేఘన. దాదాపు ఏడాది తరవాత ఆమె మళ్ళీ సినిమా సెట్స్ లోకి రావడం విశేషం. “ఈ రోజు నా కొడుక్కి 9 నెలలు. ఏడాది తర్వాత నేను కెమెరా ముందుకొచ్చాను,” అంటూ ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు.

ఆమె అసలు పేరు మేఘన రాజ్. అల్లరి నరేష్ సరసన ‘బెండు అప్పారావు’ సినిమాలో హీరోయిన్ గా అడుగుపెట్టారు మేఘన. తర్వాత కన్నడ చిత్రసీమలోకి అడుగు పెట్టి అక్కడ పాపులారిటీ తెచ్చుకున్నారు. చిరంజీవి సర్జాతో ప్రేమలో పడడం, పెళ్లి జరిగిపోవడం… అంతా టకాటకా జరిగిపోయాయి.

ఇకపై సినిమాల్లో నటించడం కంటిన్యూ చేస్తానని చెప్తున్నారు మేఘన.

 

More

Related Stories