పెళ్లి ఆలోచన చెయ్యను: మెహ్రీన్

- Advertisement -


ఇటీవలే మెహ్రీన్ తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకొంది. భవ్య బిష్ణోయ్ అనే ఉత్తరాది రాజకీయ నాయకుడితో ఆమెకి ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం జరిగింది. ఐతే నాలుగు నెలల తరువాత బ్రేకప్ జరిగింది. పెళ్లి ముహూర్తం ఫిక్స్ కాకుండానే ఇద్దరూ విడిపోయారు. ఈ బ్రేకప్ వల్ల ఆమె మనసు బాగా గాయపడినట్లుంది. ఇప్పట్లో పెళ్లి అనే ఆలోచన చెయ్యను అని చెప్తోంది మెహ్రీన్.

ఇప్పుడు సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. మారుతి డైరెక్షన్ లో “మంచి రోజులొచ్చాయి” అనే సినిమా పూర్తి చేసింది. వరుణ్ తేజ్ సరసన “ఎఫ్ 3″లో నటిస్తోంది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయిట.

కెరీర్ సూపర్ గా వెళ్తున్న టైంలో పెళ్లి ఫిక్స్ చేసుకొని అవకాశాలు పోగొట్టుకొంది. ఐతే, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని ఇప్పుడు తెలుసుకున్నట్లుంది. ఆమె ఇప్పుడు మరింత గ్లామరస్ గా మారింది. ఆఫర్లను లాగేసుకుంటోంది.

 

More

Related Stories