మార్చి 12న మెహ్రీన్ నిశ్చితార్థం

Mehreen

మరో అందాల భామ పెళ్లి చేసుకుంటోంది. మెహ్రీన్ పెళ్లి ఫిక్స్ అయింది అనేది పాత న్యూసే. ఇప్పుడు నిశ్చితార్థం డేట్ కూడా కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం “F3” సినిమాలో నటిస్తున్న మెహ్రీన్ కి వచ్చేనెల 12న కాంగ్రెస్ నేత భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్మెంట్ జరగనుంది. ఇరు కుటుంబాలు ఇప్పటికే బంధువులందరికి ఎంగేజ్మెంట్ డేట్ గురించి సమాచారం ఇచ్చారు. చాలా మంది హీరోయిన్లలాగే ఈ భామ కూడా ఆరేంజ్జ్ మ్యారేజ్ కే ఒప్పుకొంది. మెహ్రీన్ తల్లి ఈ సంబంధాన్ని ఫిక్స్ చేసిందట.

భవ్య బిష్ణోయ్… హర్యానాకి చెందిన యువ రాజకీయనాయకుడు. ఆయన తండ్రి సీనియర్ కాంగ్రెస్ ఎంపీ.

పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. మంచి ముహూర్తం చూసి డేట్ నిర్ణయిస్తారట. మెహ్రీన్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాల్లో “F3” ఒక్కటే చెప్పుకోదగ్గది. పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తుందని సమాచారం.

More

Related Stories