నిజంగా ‘మహానుభావురాలు’

Mehreen

“మహానుభావుడు” సినిమాలో శర్వానంద్ ఓసీడీ బాధితుడిగా కనిపిస్తాడు. అతిశుభ్రత అనే బలహీనతతో అతడు ఇబ్బంది పడుతుంటాడు. అతడ్ని ప్రేమించి మెహ్రీన్ కూడా ఇబ్బంది పడుతుంది. అయితే రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి మాత్రం తనది అచ్చంగా శర్వానంద్ క్యారెక్టర్ అంటోంది మెహ్రీన్.

అవును.. మెహ్రీన్ కు అతిశుభ్రత ఎక్కువంట. ఈ విషయాన్ని తనే స్వయంగా బయటపెట్టింది. శానిటైజర్ లేకుండా అడుగు బయటపెట్టనని, తన హ్యాండ్ బ్యాగ్ లో కనీసం 3 బాటిళ్లు ఉంటాయని చెబుతోంది.

“రియల్ లైఫ్ లో నేను ఒక ఓసీడీ పర్సన్. ఎక్కువ శానిటైజర్ వాడుతుంటాను. నా బ్యాగ్ లో కనీసం 3 శానిటైజర్ బాటిల్స్ ఉంటాయి. ఇప్పుడేదో కరోనా వచ్చిందని కాదు.. దాదాపు ఐదేళ్లుగా నాకు ఈ ఓసీడీ ఉంది. ఇప్పుడు మాస్క్ కూడా అలానే అలవాటు అయిపోయింది. నార్మల్ పొజిషన్ వచ్చిన తర్వాత కూడా నేను మాస్క్ తీయనేమో. శుభ్రత మంచిదే. అతిశుభ్రత మాత్రం మంచిది కాదు.”

ఇలా తన ఓసీడీని బయటపెట్టింది మెహ్రీన్. ఇక తన మేకప్ సీక్రెట్ కూడా బయటపెట్టింది ఈ బ్యూటీ. బయట ఎలా కనిపిస్తుందో, తెరపై కూడా అలానే కనిపిస్తుందట. ఎందుకంటే చాలా తక్కువ మేకప్ వేసుకుంటుందట మెహ్రీన్. సెట్స్ లో హీరో కంటే ముందు మేకప్ తో రెడీ అయిపోతుందట.  తన మేకప్ కు 15 నిమిషాల కంటే ఎక్కువ టైమ్ పట్టదంటోంది మెహ్రీన్. 

Related Stories