మెహ్రీన్: బాగా నచ్చిన పాత్ర ఇదే

సంతోష్ శోభన్, హీరోయిన్ మెహ్రీన్ జంటగా దర్శకుడు మారుతి తీసిన మూవీ.. “మంచి రోజులు వచ్చాయి”. ‘టాక్సీవాలా’ తర్వాత ఎస్ కే ఎన్ (SKN) నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. నవంబర్ 4న విడుదల కానుంది ‘మంచి రోజులు వచ్చాయి’. ఈ సినిమా గురించి మెహ్రీన్ చెప్తున్న కబుర్లు….

సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా

“యువి క్రియేషన్స్, యస్.కె.యన్, మారుతి మీద నమ్మకంతో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మూవీ ఒప్పుకున్నాను. కెరీర్ లో బాగా కనెక్ట్ అయిన సినిమా ఇదే. ఇందులో నాది సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్ర. పేరు పద్దూ. “F2”, “F3” సినిమాలలో చేసిన పాత్రలకంటే భిన్నంగా ఉంటుంది. నేను రియల్ లైఫ్ లో కూడా ఫన్నీగా ఉంటాను. అందుకే అల్లరి పిల్ల పాత్రలు నప్పుతాయి. ఇందులో కూడా నా క్యారెక్టర్ ఎమోషన్స్ తో పాటు ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది.

ఇది ఒక కాలనీలో జరిగే కథ ఇది.”

కోవిడ్ టైంలో షూటింగ్

“మేము ఈ సినిమాని రెండో వేవ్ లో విధించిన లాక్డౌన్ ముగిసిన వెంటనే మొదలుపెట్టాం. కోవిడ్ కేసులు పూర్తిగా తగ్గలేదు. కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని యాక్ట్ చేశాం. నేను కూడా కోవిడ్ బాధితురాలినే.”

కామెంట్స్ గురించి ఎక్కువ ఆలోచించను

“నా గురించి సోషల్ మీడియా లో వచ్చే కామెంట్స్ తెలుసు. చూస్తుంటాను. పాజిటివ్ అయినా, నెగటివ్ అయినా సమానంగా స్వీకరిస్తా. పొగడ్తలకు పొంగిపోను, విమర్శలకు కుంగిపోను.”

అలాంటివి వస్తే బాగుండు

‘మహానటి’లో కీర్తి సురేష్, ‘ఓ బేబీ’లో సమంత నటన చాలా ఇష్టం. ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే చేయాలని ఉంది.

Advertisement
 

More

Related Stories