నువ్వే కావాలి… మెహ్రీన్ లవ్వు

ఎంగేజ్మెంట్ జరిగిన రెండు రోజుల తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోని షేర్ చేసినిది మెహ్రీన్. కాంగ్రెస్ నాయకుడు భవ్య బిష్ణోయ్ తో మెహ్రీన్ నిశ్చితార్థం శుక్రవారం (మార్చి 12) జరిగింది. బిష్ణోయ్ తో దిగిన ఫోటోని ఈ రోజు పోస్ట్ చేసింది. “All that you are is all that I’ll ever need” (నువ్వు మొత్తంగా ఎలా ఉన్నావో ఆ నువ్వే నాకు కావాలి..అదే నేను కోరుకునేది) అని తన కాబోయే భర్తపై ప్రేమని వ్యక్తం చేసింది.

మెహ్రీన్, భవ్య పెళ్లి ముహూర్తం ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ వేసవి సెలవుల్లోనే ఉంటుంది అని టాక్.

పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్తుందట. ప్రస్తుతం ఆమె “ఎఫ్ 3” సినిమాలో నటిస్తోంది.

More

Related Stories