ఇప్పుడు మెహ్రీన్ లక్ష్యం వేరు

Mehreen

సినిమా ఇండస్ట్రీలో అదృష్టం తారు మారు కావడానికి ఆరు నెలలు చాలు. గతేడాది వరకు పూజ హెగ్డే అంటే పడిచచ్చారు నిర్మాతలు. ఆమె డేట్స్ కోసం ఎగబడ్డారు. ఇప్పుడు ఆమెని తమ సినిమాలో నుంచి తొలగిస్తున్నారు. ఆమె చేతిలో ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా లేదు. ఇలాంటి పరిస్థితిలోనే ఉంది మెహ్రీన్.

ఈ భామ మంచి సక్సెస్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకొంది. “ఎఫ్ 2” వంటి భారీ హిట్ కొట్టిన తర్వాత ఆమె ఒక వ్యాపారవేత్తతో ఎంగేజ్ మెంట్ చేసుకొంది. పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకొంది. దాంతో, ఆ మోజులో ఆమె సినిమాలు రిజెక్ట్ చేసింది. కానీ, ఆమె పెళ్లి రద్దు అయింది. ఎంగేజ్ మెంట్ జరిగిన తర్వాత ఆమెకి, ఆమెని చేసుకోవాల్సిన అతనికి మధ్య విభేదాలు వచ్చాయి.

దాంతో, ఆమె మళ్ళీ కెరీర్ పై దృష్టి పెట్టింది. కానీ, అప్పటికే నిర్మాతలు కొత్త భామలవైపు చూపు వేశారు. అందుకే “ఎఫ్ 3” హిట్ అయినా కూడా మెహ్రీన్ కి కొత్తగా ఆఫర్లు రాలేదు. దాంతో ఈ భామ టూర్ల మీద టూర్లు వేస్తోంది.

ప్రతి నెలా ఒక కొత్త ప్రదేశం వెళ్తోంది. ప్రస్తుతం ఈ భామ గ్రీక్, ఆ చుట్టుపక్కల దేశాల్లో విహరిస్తోంది. అక్కడి నుంచి ఫోటోలు అప్లోడ్ చేస్తోంది. వయసులో ఉన్నప్పుడే, డబ్బు దండిగా ఉన్నప్పుడే ప్రపంచం అంతా చుట్టేసి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుంది కాబోలు.

ALSO CHECK Photos of Mehreen in Greece

Advertisement
 

More

Related Stories