
అందాల ఇలియానా ఇప్పుడు ఓ తల్లి. ఇలియానా ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. బాబు పుట్టిన ఐదు రోజుల తర్వాత ఆ వార్తని జనంతో షేర్ చేసుకొంది. తన బాబు పేరు కోవా ఫినిక్స్ డోలన్ (Koa Phoenix Dolan) అని తానే ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
ALSO READ: Ileana blessed with baby boy
ఆమె కొడుక్కి తండ్రి ఎవరు? ఈ ప్రశ్న అందరిలో మేలుగుతోంది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మైఖేల్ డోలన్ (Dolan) ఆమె జీవిత భాగస్వామి అని అంటున్నారు. అందుకే, తన కొడుకు పేరులో డోలన్ అనే ఇంటిపేరుని తగిలించింది ఇలియానా.
ముంబైకి చెందిన ఒక పత్రిక కథనం ప్రకారం ఇలియాన ఈ మే నెలలో పెళ్లి చేసుకుందట. మైఖేల్ డోలన్, ఇలియానా తమ పెళ్లిని రిజిస్టర్ చేయించారట. దాని ఆధారంగా ఈ పత్రిక న్యూస్ ప్రచురించింది. ఐతే, మైఖేల్ గురించి ఎవరి వద్ద పెద్ద సమాచారం లేదు.
మొన్నటివరకు ఆమె జీవిత భాగస్వామిపై రకరకాల ఊహాగానాలు సాగాయి. కత్రిన కైఫ్ సోదరుడు సెబాస్టియన్ ఆమె బాయ్ ఫ్రెండ్ అని, ఆమెని తల్లిని చేసింది అతనే అని ప్రచారం సాగింది. కానీ, అది తప్పు అని ఇప్పుడు తేలింది. ఐతే, ఇలియానా తన భర్త పేరు, అతని ఫోటో ఎప్పుడు జనాలకు పరిచయం చేస్తుందో చూడాలి.