- Advertisement -

మృణాళిని రవి… డబమాష్ వీడియోలు చేస్తుండేది. అవి చూసి ఆమెని ‘గద్దలకొండ గణేష్’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం చేశారు దర్శకుడు హరీష్ శంకర్. ఆ సినిమా బాగా ఆడింది. కానీ ఎందుకనో మరో మూవీ అఫర్ రాలేదు. కానీ సొంత భాష తమిళంలో మాత్రం సినిమాలు చేస్తూనే ఉంది మృణాళిని.
ఇప్పుడు తెలుగులో కూడా ఆమె రెండు సినిమాలు ఒప్పుకొందని టాక్. రీసెంట్ గా ఇద్దరు దర్శకులు వచ్చి కథ చెప్పారట. అవి ఆమెకి నచ్చాయట. వాటి డీటెయిల్స్ త్వరలోనే ప్రకటిస్తానని చెప్తోంది. సో, మృణాళిని రవి మళ్ళీ టాలీవుడ్ లో మెరవనుందన్నమాట.