19న థియేటర్ లలో ‘మిస్సింగ్’

Missing

హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “మిస్సింగ్”. శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ఈనెల 19న విడుదల కానుంది. “మిస్సింగ్ మూవీలో మిస్ అయ్యేది నేనే. కాబట్టి ఈ నెల 19న ప్రేక్షకులు అందరూ నన్నే వెతుకుతారు అనుకుంటున్నాను,” అని అంటోంది హీరోయిన్ నికీషా.

“ఓటీటీ ఆఫర్స్ ఎన్ని వచ్చినా థియేటర్ రిలీజ్ కే మొగ్గు చూపాం. అంతా కొత్తవాళ్లం చేసిన ప్రయత్నమిది. తప్పకుండా మీకు నచ్చేలా ఉంటుంది,” అంటున్నారు హీరో హర్ష.

దర్శకుడు శ్రీని జోస్యుల: “మా మూవీలో ఎక్కడా వల్గారిటీ ఉండదు. మంచి థ్రిల్లింగ్ ఎక్సీపిరియన్స్ ఇచ్చే చిత్రమిది. మీకు నచ్చితే పది మందికి చెప్పండి. లేకుంటే మాకు చెప్పండి, లోపాలు ఉంటే కరెక్ట్ చేసుకుంటాం. వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఉండాలన్నదే మా కోరిక.”

భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరిరావు నర్రా ఈ సినిమాని నిర్మించారు.

Advertisement
 

More

Related Stories