- Advertisement -

సయ్యద్ సోహైల్ రియాన్, రూపా కొడవాయుర్ జంటగా నటించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ గత శుక్రవారం విడుదలైంది. మేల్ ప్రెగ్నెన్సీ అనే కాన్సెప్ట్ తో దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ సినిమాను రూపొందించారు. డిఫరెంట్ మూవీస్ చేస్తూ న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు.
కాన్సెప్ట్ పరంగా కొత్తగా ఉండడం ఈ సినిమాకి ప్లస్ అయింది. కొత్తదనం కోరుకునే యూత్ దీనికి మంచి లైక్స్ కొడుతున్నారు.
మొదటి రోజు పెద్దగా కలెక్షన్లు రాలేదు. కానీ టాక్ బాగుండడంతో శని, ఆదివారాల్లో ఆక్యుపెన్సీ పెరిగింది.
ఒక కొత్త తరహా మూవీ చూడాలనుకునే మూవీ లవర్స్, ప్రేక్షకులకు ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మంచి ఆప్షన్.