తెలుగులో మిథున్ చక్రవర్తి కొడుకు

బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. ‘నేనెక్కడున్నా’ అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. మాధవ్ కోదాడ డైరెక్టర్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాకి మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాత.

“ఎయిర్ టెల్” యాడ్ లో నటించి పాపులర్ అయిన సశా ఛెత్రి కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు టైటిల్ వెల్లడించడంతో పాటు పోస్టర్, టీజర్ విడుదల చేశారు.

జర్నలిజం, రాజకీయం నేపథ్యంలో వస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. ఊహించని మలుపులతో సినిమా సాగుతుందని దర్శకుడు అంటున్నారు.

మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్, ప్రదీప్ రావత్, శయాజీ షిండే, అభిమన్యు సింగ్, రాహుల్ దేవ్, బ్రహ్మానందం, సీవీఎల్ నరసింహారావు, రవి కాలే, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, భాను చందర్, రమణ చల్కపల్లి, మిలింద్ గునాజి, మిహిర, ఉత్తర ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

 

More

Related Stories