చరిత్ర సృష్టించిన కీరవాణి, చంద్రబోస్

MM Keeravani and Chandrabose


తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు దక్కించుకునే అవకాశం ఇన్నేళ్లకు వచ్చింది. భారతీయ చిత్ర రంగంలో ఎందరో గొప్ప దర్శకులు ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. కానీ, మన చిత్రాలకు ఎందుకో ఆస్కార్ అవార్డులు దక్కలేదు. “మదర్ ఇండియా”, “లగాన్” వంటి సినిమాలు ఉత్తమ విదేశీ చిత్రాల క్యాటగిరిలో నామినేషన్ పొందాయి. కానీ అవార్డులు రాలేదు.

ఇక విదేశీ చిత్రాలకు పని చేసిన భారతీయ సాంకేతిక నిపుణురాలు భాను అతియా (“గాంధీ” సినిమాకి కాస్ట్యూమ్స్) ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఏ ఆర్ రెహమాన్ (మ్యూజిక్), గుల్జార్ (బెస్ట్ ఒరిజినల్ సాంగ్ రచయిత), రెసుల్ పుకెట్టి (సౌండ్ డిజైన్)… “స్లమ్ డాగ్ మిలియనర్” సినిమాకి అవార్డులు దక్కించుకున్నారు.

ఐతే, ఇంతవరకు భారతీయ చిత్రానికి పనిచేసిన భారతీయ కళాకారులకు మాత్రం ఆస్కార్ అవార్డు దక్కలేదు. కీరవాణి, చంద్రబోస్ విజేతలుగా నిలిస్తే కొత్త చరిత్ర సృష్టిస్తారు. ఇక తెలుగు సినిమా వరకు ఐతే, వాళ్లదే చరిత్ర. ఇప్పటివరకు ‘ఆర్ ఆర్ ఆర్’ తప్ప ఏ తెలుగు సినిమా ఆస్కార్ వరకు వెళ్ళలేదు. నామినేషన్ తోనే వీళ్ళు చరిత్ర లిఖించారు. ఇక గెలిస్తే అద్భుతమే. మార్చి 12న ఆ ఫలితం తెలుస్తుంది.

రాజమౌళి తీసిన “ఆర్ ఆర్ ఆర్”లోని “నాటు నాటు” పాట, ఈ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల డ్యాన్స్ విదేశీయులకు బాగా నచ్చింది. ఇప్పటికే ఈ పాటకి గోల్డెన్ గ్లోబ్ దక్కింది. ఇక ఆస్కార్ కూడా వస్తే తెలుగు సినిమా, తెలుగు సినిమా సంగీతానికి కొత్త వైభవం వస్తుంది.

కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ ని ముద్దాడాలని బలంగా కోరుకుంటోంది తెలుగుసినిమా. కామ్

 

More

Related Stories