మోహన్ బాబు చిరు గిఫ్ట్

mohanbabu gift


“ఎవరు లెజెండ్, ఎవరు సెలబ్రిటీ?” అని మోహన్ బాబు… దాదాపు పుష్కర కాలం క్రితం పెద్ద దుమారం రేపారు. చిరంజీవిపై ఫైర్ అయ్యారు. ఒకప్పుడు మంచి మిత్రులుగా ఉన్న మోహన్ బాబు, చిరంజీవి మధ్య గ్యాప్ పెరిగింది. మూడు, నాలుగేళ్ల వరకు అదే సీన్. ఐతే ఇద్దరూ సీనియర్లు అయిపోవడం, మనవళ్లు, మనవరాళ్లు కూడా రావడంతో… విభేదాలు పక్కన పెట్టి మళ్ళీ స్నేహం చిగురింపచేసుకున్నారు.

లేటెస్ట్ గా చిరంజీవిని మోహన్ బాబు అన్నివిధాలా సపోర్ట్ చేస్తున్నారు. నిన్న చిరంజీవి 65వ పుట్టినరోజు నాడు ఒక అందమైన బహుమతిని అందచేశారు మోహన్ బాబు. రాజసం ఉట్టిపడేలా ఉంది అని చిరు మురిసిపోయారు ఆ బహుమతిని చూసి. చెక్కతో చేసిన ఒక బైక్ కళాకృతి అది.

చూస్తే అచ్ఛంగా బైక్ లానే ఉంది. కాకపొతే అది ఉడెన్ బైక్. చిరంజీవి కోసం ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించారట మోహన్ బాబు.


“నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి… … … Thank you,” అంటూ చిరంజీవి మోహన్ బాబు గిఫ్ట్ ని చూసి ఆనందపడ్డారు.

Related Stories