
సీనియర్ నటుడు మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి దూరంగా జరుగుతున్నట్లు ఉంది. ఆయన ఆశించిన పనులు జరగలేదు. దాంతో, వైస్సార్సీపీ మనిషిగా కాకుండా బీజేపీ మనిషిగా ఉండాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది.
“కేంద్రంలో ప్రధానిగా మోదీ ఉండాలనేది మొదటినుంచి నా అభిమతం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకుంటా. నేను బీజేపీ మనిషినే,” అని తాజాగా మోహన్ బాబు ప్రకటించారు. ఆయన గతంలో తెలుగుదేశంలో ఉన్నారు. ఆ తర్వాత వైఎసార్సీపీ మద్దతుదారు అయ్యారు. ఇప్పుడు మోదీ జపం చేస్తున్నారు మోహన్ బాబు.
దేశంలో మోదీ హవా ఇప్పట్లో తగ్గదని భావించిన మోహన్ బాబు ఇలా ప్లేట్ ఫిరాయించినట్లు అనుకోవాలా? లేక తనకి ఇతర ఆఫ్సన్లు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్.జగన్ కి మోహన్ బాబు చెప్తున్నారా? అన్నది చూడాలి.
సీఎం జగన్ తో మోహన్ బాబుకి చుట్టరికం ఉంది. అయినా, మోహన్ బాబుని జగన్ దగ్గరికి రానివ్వడం లేదు అనేది గుసగుస.