
సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుకి కోపం వచ్చింది. ఆయన పేరుని కొందరు రాజకీయంగా “ఉపయోగించుకుంటున్నార”ట. కొందరి చర్యలు ఆయనకు ఆగ్రహం తెప్పించాయి. తన పేరుని వాడుకోవద్దని, ఎవరైనా అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని మోహన్ బాబు హెచ్చరించారు.
మోహన్ బాబు ఒకప్పుడు టీడీపీలో ఉండేవారు. కొన్నాళ్ళూ ప్రధాని మోదీని పొగుడుతూ కొనసాగారు. ఆ తర్వాత వైఎస్సార్సీ పార్టీ సానుభూతి పరుడిగా ఉన్నారు. ఇప్పుడు ఏ పార్టీలో లేరు. అందుకే, ఆయన ఎవరూ తన పేరుని వాడుకొని రాజకీయంగా “లబ్ది” పొందే ప్రయత్నం చేయొద్దని లేఖ రాశారు.
మంచు మోహన్ బాబు ప్రస్తుతం తన కుమారుడు విష్ణు హీరోగా “భక్త కన్నప్ప” చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన సినిమాల్లో నటించడం లేదిప్పుడు.
రాజకీయాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు భార్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి సోదరి (కజిన్). ఇక ఆయన చిన్న కొడుకు మనోజ్ భార్య భూమా మౌనిక తెలుగుదేశంలో ఉన్నారు. ఆయన కూతురు లక్ష్మీ ప్రసన్న ప్రధాని మోదీకి వీరాభిమాని.
విజ్ఞప్తి pic.twitter.com/kHnATpRdA5
— Mohan Babu M (@themohanbabu) February 26, 2024