
“మోహన్ బాబు గారూ… మీరు, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బంధువులు అని చెప్తుంటారు కదా… మీరైనా జగన్ కి చెప్పండి…” అంటూ నిన్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ కలకలం రేపింది. ఇప్పటికే ఆయన స్పీచ్ పై దుమారం మొదలైంది. తాజాగా మోహన్ బాబు స్పందించారు. కాకపోతే, తన వైఖరికి భిన్నంగా మోహన్ బాబు ఈసారి దూకుడు ప్రదర్శించలేదు. “మా” ఎన్నికలు పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానము ఇస్తానని అంటున్నారు మోహన్ బాబు.
మా ఎన్నికల్లో తన కొడుకు మంచు విష్ణుకు ఓటు వెయ్యాల్సిందిగా పవన్ కళ్యాణ్ ని కోరారు మోహన్ బాబు.
“నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్ కళ్యాణ్ నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏకవచనంతో సంబోధించాను. వవన్ కళ్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమిలేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావు, సంతోషమే.ఇప్పుడు మా ఎలక్షన్స్ జరుగుతున్నాయి.
నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడ్డాడు అన్న సంగతి నీకు తెలిసిందే. అక్టోబర్ 10వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి.
ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతిమాటకి నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని… నీ అమూల్యమైన ఓటుని నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి, అతని ప్యానల్ కి వేసి వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ వెరీమచ్..”
ఇది మోహన్ బాబు లేఖ. పవన్ కళ్యాణ్ ఘాటుగా ప్రశ్నిస్తే మోహన్ బాబు బాగా తగ్గి లేఖ రాయడం ఆశ్చర్యమే.