- Advertisement -

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇప్పటికే తెలుగులో ఎంతో పాపులారిటీ ఉంది. ‘జనతా గ్యారేజ్’ సినిమాతో మోహన్ లాల్ సినిమాలకు తెలుగులో కూడా క్రేజ్ పెరిగింది. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి తీసే తెలుగు సినిమాలో కూడా ఆయన నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. కానీ దానిపై క్లారిటీ లేదు.
లేటెస్ట్ గా ఆయన “ఆరాట్టు” అనే ఒక మలయాళ సినిమా టీజర్ విడుదలయింది. ఉన్నికృష్ణన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మలయాళ సినిమా ఒక మాస్ ఎంటర్ టైనర్. మోహన్ లాల్ పక్కా మాస్ పాత్రలో కనిపిస్తారు.
“ఆరాట్టు”లో ఒక తెలుగు డైలాగ్ ఉండడం విశేషం. “నేను వాడిని చంపేస్తా” అంటూ మోహన్ లాల్ ఈ సినిమాలో డైలాగ్ చెప్పారు. ఈ మొత్తం టీజర్ లో ఉన్న ఒకే డైలాగ్ అది. దాంతో మన తెలుగు వాళ్ళు ఈ టీజర్ ని ట్రెండ్ చేస్తున్నారు.