ఇప్పుడే తొందరెందుకు!

- Advertisement -
Salman Khan in Radhe


చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించనున్నాడు అని తెలుగుసినిమా.కామ్ ఇప్పటికే వెల్లడించింది. సల్మాన్ ఖాన్ చిన్న అతిథి పాత్రలో దర్శనమిస్తారు. ఐతే, సల్మాన్ ఖాన్ పేరుని ఇప్పుడే ప్రకటించే ఆలోచనలో లేదు ‘గాడ్ ఫాదర్’ టీం.

తాజాగా ట్విట్టర్ స్పేస్ లో ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా ఈ విషయంపై స్పందించాడు. “సల్మాన్ ఖాన్ నటిస్తున్నారా,” అని అడిగితే అభిమానులు ఆయన్ని డైరెక్ట్ గా అడిగారు. “ఇప్పుడే తొందరెందుకు. మీరు అందరూ మాట్లాడుకునే రేంజులోనే ఈ సినిమా అప్డేట్లు ఉంటాయి.” ఇది ఆయన రిప్లై.

సల్మాన్ ఖాన్, చిరంజీవి కుటుంబానికి మధ్య మంచి అనుబంధం ఉంది. చిరంజీవి అంటే సల్మాన్ ఖాన్ కి ప్రత్యేక అభిమానం. అందుకే, మెగాస్టార్ అడిగారని చిన్న పాత్ర అయినా ఒప్పుకున్నారట సల్మాన్ ఖాన్.

‘గాడ్ ఫాదర్’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నయనతార, సత్యదేవ్ నటించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

 

More

Related Stories