ఇంద్రగంటి ప్లాన్స్ తారుమారు

Mohana Krishna Indraganti

డైరెక్టర్ ఇంద్రగంటి భారీ ప్రణాళిక మొత్తం అప్ సెట్ అయింది. “వి” సినిమా తర్వాత ఎలాంటి భారీ సినిమా అయినా తాను హేండిల్ చేయగలనని నిర్మాతలకు కాన్ఫిడెన్స్ వస్తుంది అని భావించారు ఇంద్రగంటి మోహన కృష్ణ. కానీ అయన నెక్స్ట్ సినిమాల విషయంలో ప్లానింగ్ తారుమారు అయింది. విజయ్ దేవరకొండతో పాన్-ఇండియా సినిమా ఒకటి అనుకున్నారు. కానీ అది ఇప్పడు వెనక్కి వెళ్ళింది. విజయ్ దేవరకొండ …ప్రస్తుతం నటిస్తోన్న పూరి మూవీ విడుదలైన తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేస్తాడు. అలాగే, నాగ చైతన్యతో ప్లాన్ చేసిన సినిమాపై ఇంద్రగంటికి ఇంకా క్లారిటీ రావట్లేదు.

చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల తీస్తున్న “లవ్ స్టోరీ” సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత విక్రమ్ కుమార్ తీసే “థాంక్యూ” సినిమా మొదలు పెడుతాడు. అది పూర్తి అయ్యాక, వెంటనే ఇంద్రగంటి డేట్స్ ఇస్తాడా లేదంటే వేరే దర్శకుడితో మరో మూవీ చేసుకున్న తర్వాత ఇస్తాడా అన్నది క్లారిటీ లేదు. అందుకే, ఇంద్రగంటి ఈ గ్యాప్ లో మరో చిన్న సినిమా చేసేలా ప్లాన్ చేస్తున్నాడట.

ఇంద్రగంటి అంతకుముందు తీసిన “అష్టాచెమ్మా”, “జెంటిల్ మేన్”, “అమీ తుమీ”, “సమ్మోహనం” వంటి సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి కానీ అవన్నీ తక్కువ బడ్జెట్ తో తీసినవి. తన రేంజ్ పెంచుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నం… “వి”. ఐతే, కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్లో బదులు ఓటిటి ప్లాట్ఫారంలో విడుదల అయింది. దీనివల్ల ఈ సినిమా రేంజ్ ఎంత అనేది తెలియకుండా పోయింది. ఆలా ఇంద్రగంటి అంతకుముందు అనుకున్నది వేరు వి తర్వాత జరిగింది వేరు.

Related Stories