బాలయ్యకి మోహన్ బాబు అభినందన


నందమూరి బాలకృష్ణకి, మోహన్ బాబు కుటుంబానికి ఉన్న బంధం ప్రత్యేకం. మోహన్ బాబు ఎన్టీఆర్ కి వీరాభిమాని. బాలయ్యతో అదే స్నేహం కొనసాగిస్తున్నారు. ఇటీవల మా ఎన్నికల్లో బాలయ్య మంచు విష్ణుకు మద్దతు తెలిపిన వైనం చూశాం. అలాగే, బాలయ్య నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్’ షోకి మొదటి గెస్టులు కూడా మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి ప్రసన్ననే.

అందుకే, ‘అఖండ’ ఘన విజయం పొందగానే బాలయ్యని కలిశారు మోహన్ బాబు, విష్ణు. అభినందనలు తెలిపారు.

“సినిమా థియేటర్ కి ప్రేక్షకులు రారు, చూడరు అనుకుంటున్న క్లిష్టపరిస్థితుల్లో అఖండ విజయం సాధించిన “అఖండ” సినిమా, సినీ పరిశ్రమకి ఊపిరి పోసింది. విడుదలకి సిద్దంగా ఉన్న చాలా సినిమాలకి ధైర్యాన్నిచ్చింది. నా సోదరుడు బాలయ్యకి, టీంకి శుభాకాంక్షలు,” అని అన్నారు మంచు మోహన్ బాబు.

Advertisement
 

More

Related Stories