మోహన్ బాబుతో మోహన్ లాల్!

- Advertisement -

హైదరాబాద్ కి ఫేమస్ వాళ్ళు ఎవరు వచ్చినా… వారిని తమ ఇంటికి విందుకు ఆత్మీయంగా పిలుస్తారు మంచు మోహన్ బాబు. వాళ్ళు కూడా కాదనలేరు. ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించిన లేటెస్ట్ సెలబ్రిటీ మోహన్ లాల్.

మోహన్ లాల్ ప్రస్తుతం ‘బ్రో డాడీ’ అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. ‘లూసిఫర్’ సినిమా తీసిన నటుడు పృథ్విరాజ్ ఈ మూవీకి దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. మోహన్ లాల్ సరసన మీనా నటిస్తోంది. తనతో అనేక చిత్రాల్లో నటించిన మీనాతో పాటు మోహన్ లాల్ ని తన ఇంటికి పిలిచి మంచి పార్టీ ఇచ్చారు మోహన్ బాబు.

మోహన్ బాబు, మోహన్ లాల్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, రజినీకాంత్… ఇలా పలువురు 1980లలో కెరీర్ లో స్టార్స్ మధ్య మంచి స్నేహం ఉంది. వీరు తరుచుగా కలుసుకుంటూ ఉంటారు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

More

Related Stories