కన్నీళ్ళతో హౌజ్ తడిపేస్తోంది

Bigg Boss Telugu 4 – Episode 3

బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లిన వాళ్లలో మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది మోనాల్ మాత్రమే. ఒకే ఒక్క హీరోయిన్ గా హౌజ్ లో అడుగుపెట్టిన మోనాల్.. తన క్రేజ్ ను మరింత పెంచుకుంటుందని, గ్లామర్ తో హౌజ్ లో మెరుపులు మెరిపిస్తుందని బిగ్ బాస్ ప్రేక్షకులు కలలుగన్నారు. అయితే వాళ్లు ఊహించుకున్న దానికి పూర్తి రివర్స్ లో జరుగుతోంది మోనాల్ వ్యవహారం.

హౌజ్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఏడుపుల పర్వం ప్రారంభించింది మోనాల్. ఓ హీరోయిన్ నుంచి ఇలాంటి బిహేవియర్ ను ప్రేక్షకులు అస్సలు ఊహించలేదు. గ్లామర్ గా కనిపిస్తుందని, నవ్వులు చిందుస్తుందని ఆశించిన జనాలకు మోనాల్ మూడు రోజులుగా షాకులు మీద షాకులు ఇస్తూనే ఉంది. చివరికి ఎపిసోడ్-3ను కూడా ఆమె ఏడుపులతోనే ముగించింది.

కట్టప్ప ఎవరు?

ఇక Bigg Boss Telugu 4 – Episode 3 హైలెట్స్ విషయానికొస్తే.. గొడవలు, ఏడుపుగొట్టు సీన్లతో షో నిండిపోయింది. కట్టప్ప కంటెస్ట్ మినహా మిగతాదంతా పులిహోరే. హౌజ్ లో కట్టప్ప ఉన్నాడంటూ సోమవారమే బాంబు పేల్చిన బిగ్ బాస్.. ఆ కట్టప్ప ఎవరై ఉంటారో ఊహించండంటూ మంగళవారం పోటీపెట్టాడు. దీంతో ఒక్కొక్కరుగా వెళ్లి తమ మనసులో కట్టప్ప అనుకుంటున్న కంటెస్టెంట్ పేరు పేపర్ పై రాసి బాక్స్ లో వేశారు. గంగవ్వకు రాయడం రాదు కాబట్టి సుజాత చెవిలో అఖిల్ సార్థక్ పేరు చెప్పింది. బయటనుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ డబ్బా తీసుకెళ్లిపోయారు. ఈ వీకెండ్ ఎలిమినేషన్ రౌండ్ లో “కట్టప్ప డబ్బా” కీలక పాత్ర పోషించబోతోందన్నమాట.

Related Stories