మోనాల్ కి కలిసిరాని స్పెషల్ సాంగ్

MOnal Gajjar

‘బిగ్ బాస్ సీజన్ 4’తో ఎంతో పాపులర్ అయిన భామ… మోనాల్ గజ్జర్. ఆమె టాప్ 5లోకి వెళ్ళలేదు. అయినా కూడా ఆమెకి సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోలు వచ్చాయి అంటే ఎంత క్రేజ్ తెచుకోగలిగిందో అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె షూటింగ్ పూర్తి చేసిన మొదటి సినిమా… ‘అల్లుడు అదుర్స్’.

ఈ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ చేసింది. ఆ పాటలో అందచందాలు ఆరబోసింది. ఆమెకి మంచి కలర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు సినిమాలో. పారితోషికం కూడా గట్టిగానే ముట్టింది. కానీ సినిమా మాత్రం దారుణంగా పరాజయం పాలైంది. దాంతో అమ్మయికి మొదటి స్పెషల్ సాంగ్ స్పెషల్ జ్ఞాపకంగా మిగల్లేదు.

మోనాల్ గజ్జర్ ఇక స్పెషల్ సాంగ్ లు కట్టిపెట్టి వెబ్ సిరీస్ లు, హీరోయిన్ పాత్రలు వైపు ఫోకస్ షిఫ్ట్ చేయనుంది.

More

Related Stories