బ్యాంక్ రాబరీ కథ క్లైమాక్స్

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన వెబ్ సిరీస్ మనీ హైస్ట్. 4 సీజన్లతో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఈ సిరీస్, తుది ఘట్టానికి చేరుకుంది. అవును.. త్వరలోనే రాబోతున్న సీజన్-5తో మనీ హైస్ట్ కు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు మేకర్స్. ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది.

మనీ హైస్ట్ సీజన్-5 షూటింగ్ సోమవారం నుంచి డెన్మార్క్ లో ప్రారంభం అవుతుంది. 9 ఎపిసోడ్స్ తో ఈ ఫైనల్ సీజన్ ను ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది సమ్మర్ నాటికి సీజన్-5ను స్ట్రీమింగ్ కు పెట్టాలనేది టార్గెట్.

బ్యాంక్ రాబరీ కాన్సెప్ట్ తో ప్రారంభమైన ఈ సిరీస్.. ఎన్నో కీలకమైన మలుపులు తీసుకుంది. ప్రతి సీజన్ తో వరల్డ్ వైడ్ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అయితే సీజన్-4 క్లైమాక్స్ కు వచ్చేసరికి ఏకంగా మెయిన్ క్యారెక్టర్ ప్రొఫెసరే పోలీసులకు దొరికిపోవడంతో కథ రసకందాయంలో పడింది. అక్కడ్నుంచి సీజన్ -5ను స్టార్ట్ చేసి 9 ఎపిసోడ్స్ లో మనీ హైస్ట్ కు ముగింపు ఇవ్వాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. 

 

More

Related Stories