నా బ్రాండ్స్ పోతున్నాయి: రకుల్

Rakul Preet Singh

డ్రగ్స్ కేసులో తన పేరు బద్నామ్ చేస్తూ మీడియా రాతలను, వార్తలను ఆపాలంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. కోర్టు కూడా ఈ విషయాన్నీ పరిశీలించాల్సిందిగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖని ఆదేశించింది. ఆమె తన పేర్కొన్న పిటిషన్లో కొన్ని ఆసక్తికర అంశాలున్నాయి.

  • నేను ఈ పిటిషన్లో ఏ ఒక్క చానెల్ని పేర్కొనట్లేదు… మొత్తం మీడియా అంతా పద్దతిగా ఉండాలి.
  • రియా చెప్పిందని పేర్కొంటున్న తప్పుడు స్టేట్మెంట్ వల్ల నా బ్రాండ్స్ పోవడం మొదలైంది.ఒప్పందం రద్దు చేసుకుంటామని కార్పొరేట్ బ్రాండ్స్ అంటున్నాయి.
  • రియా చెప్పలేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చెప్పిన విషయాన్నీ మాత్రం అన్ని ఛానెల్స్ ప్రసారం చెయ్యలేదు.
  • అలాగే నా గురించి వార్తలు ప్రసారం చేసేటప్పుడు కావాలనే నా సినిమాల్లోని స్మోకింగ్, డ్రింకింగ్ సీన్లు వేస్తూ నాపై ఒక బాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు. పాత్ర డిమాండ్ మేరకు నటించిన సీన్లను అభ్యంతరకర పద్దతిలో వాడుతున్నారు.
  • కొన్ని ఛానెల్స్.. నేను రియా, సుశాంత్ పక్కపక్కన కూర్చొని దమ్ము కొడుతున్నట్లు ఫోటోషాప్ లో ఇమేజ్ క్రీయేట్ చేసి ప్రసారం చేశారు.

Related Stories