ఇంకా అప్డేట్స్ ఉన్నాయట

Naresh and Pavitra

2022కి మంచి ఫినిషింగ్ టచ్ ఏంటంటే నరేష్, పవిత్ర పెళ్లి వార్త. వీరి మధ్య ఉన్న బంధం గురించి చాలాకాలంగా రచ్చ ఉంది. వాళ్లిద్దరూ ఒక హోటల్లో ఒకే రూమ్ లో ఉండగా నరేష్ మూడో భార్య చేసిన గొడవ టీవీ చానెళ్లకు, యూట్యూబ్ చానెళ్లకు మంచి ‘కంటెంట్’ ఇచ్చింది. ఇప్పుడు ఏడాది చివరి రోజు అందరూ మాట్లాడుకునే విధంగా నరేష్, పవిత్ర తాము పెళ్లి చేసుకోబుతున్నట్లు ప్రకటించారు.

పెళ్లి ప్రకటన కన్నా ఈ సందర్భంగా వాళ్ళు విడుదల చేసిన వీడియో హాట్ టాపిక్ అయింది. ఆ వీడియోలో ఇద్దరూ ముద్దు పెట్టుకోవడం. చేతిలో సాంపేన్ గ్లాసులు పట్టుకోవడం… అట్లాంటి ఇట్లాంటి రొమాంటిక్ మూమెంట్ కాదబ్బా! నరేష్, పవిత్ర ఇచ్చి పడేశారంతే.

ఐతే, దీంతోనే వీరి ‘మేటర్’ అయిపోయింది అనుకోకండి. ఇంకా చాలా అప్డేట్లు ఉన్నాయట. పెళ్లి ముహూర్తం గురించి త్వరలోనే ఒక ప్రకటన రానుంది. ఆ పెళ్లి హడావిడి, దానికి ముందు సంగీత్ ఇతరత్రా హంగామా కూడా ఉంటుంది. సో, మీడియాకి, సోషల్ మీడియాకి చాలా టైం పాస్.

వెనకటి కాలంలో కూడా హీరోలు, హీరోయిన్లు రెండో పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అఫైర్లు సాగించేవాళ్లూ ఉన్నారు. కానీ, అప్పుడు అంతా గుట్టుచప్పుడు కాకుండా ఉండేది. కానీ, నరేష్, పవిత్ర మాత్రం కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు.

Naresh and Pavitra

నరేష్ ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడు పవిత్రతో నాలుగో పెళ్లి. పవిత్ర లోకేష్ కి ఇంతకుముందు ఒక పెళ్లి అయింది. ఆయన నుంచి విడిపోయారు.

 

More

Related Stories