మళ్ళీ మల్టీ సినిమాల ఫైట్


గత వీకెండ్ మూడు స్ట్రెయిట్ చిత్రాలు, ఒక డబ్బింగ్ సినిమా పోటీ పడ్డాయి. అందులో ఒకటే (జాతిరత్నాలు) ఆడింది. ఈ వారం కూడా మూడు మెయిన్ సినిమాలు పోటీపడుతున్నాయి. చావు కబురు చల్లగా, మోసగాళ్లు, శశి… ఈ మూడు చిత్రాల మధ్య పోటీ ఉంటుంది ఈ వీకెండ్. ఐతే, ఏ సినిమాపై కూడా అంచనాలు లేవు. విడుదలైన తర్వాత మంచి టాక్ తెచ్చుకుంటే నిలబడే సినిమాలివి. ఈ మధ్య అన్ని సినిమాలు మౌత్ టాక్ తోనే ఆడుతున్నాయి.

“చావు కబురు చల్లగా” సినిమాలో కార్తికేయ హీరో, లావణ్య త్రిపాఠి హీరోయిన్. బన్నీ వాసు నిర్మించాడు. ట్రైలర్ ఇంట్రెస్ట్ కలిగించింది. కార్తికేయ నటనలో పరిణితి కనిపించింది ట్రైలర్ లో. ఐతే, “ఆర్ ఎక్స్ 100” తర్వాత మరో బ్లాక్ బస్టర్ అందుకోలేదు కార్తికేయ. మరి ఈ సినిమాతో అది దక్కుతుందా అనేది చూడాలి.

మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తీసిన మూవీ “మోసగాళ్లు”. హాలీవుడ్ డైరెక్టర్ తీసిన మూవీ. కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి…ఇలా బిగ్ నేమ్స్ ఉన్నాయ్. కానీ ట్రైలర్ మాత్రం ఏ మాత్రం ఆసక్తిని కలిగించలేదు.

అది సాయికుమార్ హీరోగా రూపొందిన మూవీ… “శశి”. ఆది సాయికుమార్ సినిమాలంటే అస్సలు ఓపెనింగ్ రాదు. కానీ ఈ సినిమాకి విచిత్రంగా ఒక బజ్ వచ్చింది. దానికి కారణం. ఈ సినిమాలో ఒక పాట వైరల్ కావడం.

More

Related Stories