‘బ్యాచిలర్’కి ఊపు రావట్లేదు!

'బ్యాచిలర్'కి ఊపు రావట్లేదు!

పాపం అఖిల్ అక్కినేనికి ఏదీ కలిసి రావట్లేదు. వరుసగా మూడు సినిమాలు సరైన బ్రేక్ తీసుకురాకపోవడంతో గీతా ఆర్ట్స్ క్యాంపులో చేరాడు. నాలుగో సినిమాని GA2 Pictures బ్యానర్ లో చేస్తున్నాడు. అదే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమా. ఇప్పటికే పలుసార్లు రీషూట్లు, రిపేర్లు జరుపుకొంది ఈ మూవీ. ఇప్పటివరకు రెండు పాటలు కూడా విడుదల చేశారు. టీజర్స్ వచ్చాయి. అయినా కూడా రావలిసిన క్రేజ్ రావట్లేదు.

పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. కానీ పాపం ఎందుకో విడుదలైన ఏ పాట కూడా వైరల్ కాలేదు. సినిమా టీజర్ ని కూడా జనం మర్చిపోయారు.

జూన్ లో విడుదల కానుంది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. రిలీజ్ కు ముందు ఏమైనా బజ్ పెరుగుతుందేమో చూడాలి. లేదంటే అఖిల్ ఫ్యాన్స్ అప్పుడే ఈ సినిమాని వదిలేసి… డైరెక్టర్ సురేందర్ రెడ్డి తీసే సినిమాపై ఆశలు పెంచుకోవడం మొదలుపెట్టారా?

More

Related Stories