‘పెళ్లి చేసుకొని ఉంటే బాగుండేది’

Mrunal

ఇప్పటికే పెళ్లి చేసుకొని ఉంటే బాగుండేది అని అప్పుడప్పుడు తనకు అనిపిస్తుంది అని అంటోంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్.

ఆమె ఈ విషయాన్ని “ఫ్యామిలీ స్టార్” సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. కుటుంబం ముఖ్యమని చెప్పిన ఈ భామ 30 దాటకముందే పెళ్లి చేసుకొని పిల్లలను కని వారితో సరదాగా రెస్టారెంట్లకు వెళ్తే బాగుంటుంది. ఆ ఆలోచన నాకు వస్తుంటుంది అని తెలిపింది.

ఆమెకి ఇప్పుడు 31 ఏళ్ళు. హీరోయిన్ గా ఇప్పుడే ఎక్కువ పాపులారిటీ వస్తోంది. డబ్బుల సంపాదన కూడా ఇప్పుడే ఎక్కువ. అందుకే పెళ్లి చేసుకోవట్లేదు. కానీ ఆ ఆలోచన మాత్రం ఉంది ఈ అమ్మడికి.

గతంలో మృణాల్ ఒక బాలీవుడ్ హీరోతో డేటింగ్ లో ఉండేది. కానీ ఇప్పుడు సింగిల్.

తెలుగులో ఇప్పటికే “సీతారామం,” హాయ్ నాన్న” సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ సుందరి “ఫ్యామిలీ స్టార్”తో హ్యాట్రిక్ కంప్లీట్ చెయ్యాలని ఆశపడుతోంది.

 

More

Related Stories