మృణాల్ కి ఇంకో ఆఫర్!

Mrunal


“సీతారామం” సైలెంట్ గా పెద్ద హిట్ అయింది. ఈ మధ్య కాలంలో అటు కమర్షియల్ గా, ఇటు క్రిటికల్ గా సక్సెస్ అయిన చిత్రం ఇదే. ఈ సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ అందాల సుందరి సౌందర్యానికి కుర్రకారు ఫిదా అయ్యారు.

ఐతే, సినిమా అంత పెద్ద విజయం సాధించినా మృణాల్ కి వెంటనే తెలుగు నిర్మాతల నుంచి అడ్వాన్స్ చెక్కు వెళ్ళలేదు. సాధారణంగా ఒక హీరోయిన్ అందానికి ఎక్కువ మార్కులు పడితే, ఆ హీరోయిన్ ని సైన్ చేసేందుకు మన దర్శక, నిర్మాతలు పోటీపడుతారు. టకాటకా సినిమాలు అనౌన్స్ చేస్తారు. మృణాల్ విషయంలో ఇంకా జరగలేదు. బహుశా ఆమె కొత్త సినిమాల కబురు వినేందుకు మనకు ఇంకొంచెం టైం పడుతుందేమో. ఆమె కొత్త భామ కాదు… బాలీవుడ్ లో మంచి పేరున్న నటి.

ఐతే, “సీతారామం” నిర్మాతలే ఈ భామకి మరో ఆఫర్ ఇచ్చారట. త్వరలోనే ఈ సినిమా గురించి ఒక ప్రకటన రానుంది.

Mrunal Thakur

తెలుగులో మొదటి సినిమాతోనే మంచి విజయం చూసిన ఈ బ్యూటీకి బాలీవుడ్ లో ఇంకా క్రేజ్ రాలేదు కానీ సినిమాల సంఖ్య ఎక్కువే. మృణాల్ బాలీవుడ్ లో హృతిక్ సరసన “సూపర్ 30”, షాహిద్ కపూర్ సరసన “జెర్సీ”, ఫర్హాన్ అక్తర్ తో “తూఫాన్” వంటి చిత్రాల్లో నటించింది. హిందీలో మరో నాలుగు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.

Advertisement
 

More

Related Stories