భారీగానే లాగిందట మృణాల్


మృణాల్ ఠాకూర్ అందం కుర్రకారుకి నచ్చింది. ఆమె నటన కూడా ఇంప్రెస్ చేసింది. ‘సీతారామం’ సినిమాలో సీతగా, ప్రిన్సెస్ గా అదరగొట్టిన మృణాల్ తెలుగులో తెగ బిజీ అయిపోతుందని అందరూ భావించారు. కానీ ఆమెకి రెండో ఆఫర్ ఎక్కువ కాలం పట్టింది. అంత పెద్ద హిట్ డెలివరీ చేసినా ఆమెకి ఇంకో తెలుగు సినిమా రావడానికి ఎక్కువ టైం పట్టడానికి కారణం ఉంది.

ఆ కారణం మరెంటో కాదు… పారితోషికం. భారీగా ఆమె మనీ డిమాండ్ చెయ్యడంతో ఆమెని అప్రోచయిన పలువురు దర్శక, నిర్మాతలు వెనక్కి తగ్గారు. ఐతే, నానితో 30వ చిత్రం రూపొందిస్తోన్న నిర్మాతలు మాత్రం మృణాల్ అడిగిన మొత్తం ఇచ్చేందుకు అంగీకరించారు. అలా ఆమె తన రెండో తెలుగు సినిమాని సైన్ చేసింది.

నాని 30వ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ బాలీవుడ్ భామకి ఇది రెండో తెలుగు మూవీ. దాదాపు 2 కోట్లపైనే ఆమె అడిగిందట. దానికి నిర్మాతలు ఓకె చెప్పారు.

నాని, మృణాల్ కాంబినేషన్ అదిరిపోతుందా అనేది చూడాలి. దుల్కర్ సరసన అదరగొట్టిన మృణాల్ నానికి కూడా మంచి జోడి అనిపించుకుంటే ఆమె విషయంలో ఇక నిర్మాతలు వెనక్కి తగ్గే అవకాశం ఉండదు.

 

More

Related Stories