సీతారామం బ్యూటీ అందాల విందు

మృణాల్ ఠాకూర్… ఇప్పుడు పరిచయం అక్కర్లేని పేరు. ఈ బాలీవుడ్ భామ ఒక్క సినిమాతో తెలుగువారి మనసు దోచుకుంది. ‘సీతారామం’ చిత్రంలో సీతగా, ప్రిన్సెస్ గా అదరగొట్టింది. డిగ్నిఫైడ్ డ్రెస్సింగ్, ఆ బ్యూటీకి, ఆ నటనకి ఫిదా అయింది తెలుగు ప్రేక్షకలోకం.

సినిమాలో ఒద్దికగా, సంప్రదాయ బద్దంగా కనిపించిన ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం అందాలఅరిటాకు పరుస్తుంటుంది. గత కొద్ధి రోజులుగా ఈ భామ తన ఒంపుసొంపుల సోయగాన్ని పూర్తిగా చూపించే ఫోటోలని అప్డేట్ చేస్తోంది. హిందీలో ఆమెకి విజయాలు లేకున్నా ఇన్ స్టాగ్రామ్ లో ఆరున్నర మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే కారణం ఆమె అందచందాల ప్రదర్శనే.

బాలీవుడ్ లో ఈ భామ హృతిక్ రోషన్ సరసన ఒక సినిమాలో నటించింది. అది ఓ మోస్తరు విజయం సాధించింది. ఆ తర్వాత ఫర్హాన్ అక్తర్ సరసన ‘ఫైటర్’ మూవీ చేసింది. అది ఆడలేదు. ఆ తర్వాత ‘సీతారామం’లో నటించింది. ఇది తెలుగులో భారీ విజయం సాధించింది. హిందీలో అనువదించి విడుదల చేస్తే సోసోగా ఆడింది.

Mrunal Thakur

Gallery: Mrunal Thakur’s Wacky Look

ఇప్పుడు తెలుగులో మరిన్ని అవకాశాల కోసం చూస్తోంది. కేవలం సంపద్రాయ పాత్రలే కాదు గ్లామర్ రోల్స్, మసాలా సినిమాల్లో పాత్రలు కూడా చేస్తానని ఇలాంటి ఫోటోషూట్ లతో హింట్ ఇస్తోంది కాబోలు.

 

More

Related Stories