
మృణాల్ ఠాకూర్ ఒకే ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకొంది. ‘సీతారామం’ సినిమాతో పాపులర్ అయింది. ఇక డిసెంబర్ లో ఒక మూవీ, జనవరిలో మరో మూవీతో ఈ భామ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అంటే, వరుసగా రెండు నెలల్లో రెండు సినిమాలు విడుదలవుతాయి.
ముందుగా విడుదల కానున్న చిత్రం.. హాయ్ నాన్న. ఈ సినిమాలో ఆమె నాని సరసన నటించనుంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ ని బట్టి చూస్తే ఆమె నానికి ప్రియురాలిగా కనిపించనుంది. అలాగే, ఈ సినిమాలో నానితో ముద్దు సీన్లు కూడా చేసింది. ఇది డిసెంబర్ 7న విడుదల కానుంది. ‘సీతారామం’ తర్వాత ఆమెకి తెలుగులో ఇది రెండో మూవీ.
ఇక సంక్రాంతి కానుకగా రానుంది … ‘ఫ్యామిలీ స్టార్.’ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరో. ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ తీస్తున్న ఈ చిత్రం మొదటి లుక్ ఈనెల 18న విడుదల కానుంది. అలాగే సినిమా రిలీజ్ డేట్ కూడా అప్పుడే ప్రకటిస్తారు. సంక్రాంతి కానుకగా రానుందనేది కన్ఫమ్.
ఈ రెండు చిత్రాలు విడుదల కాగానే మరో రెండు పెద్ద సినిమాలు లైన్లో పెట్టాలని ప్లాన్ లో ఉంది. దర్శక, నిర్మాతలు కూడా ఈ సినిమాల ఫలితాలు చూసి నిర్ణయం తీసుకుందామని ఆగుతున్నారు. ఐతే, తెలుగు సినిమాలపై మాత్రం ఈ అమ్మడు ఫోకస్ పెట్టింది. ఇక్కడే పేరు వచ్చింది కాబట్టి ఇక్కడే బిజీ అవుదామని భావిస్తోంది.