ఎక్కువగా అదే తింటా: మృణాల్

Mrunal Thakur

మృణాల్ ఠాకూర్ మంచి అందెగత్తె. 31 ఏళ్ల ఈ సుందరి కొంచెం బొద్దుగా ఉంటుంది కానీ ఆమె అందచందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు.

“నాది సగటు భారతీయ యువతుల శరీర సౌష్టవం. మరీ నాజూకుగా ఉండను. ఉండలేను,” అని చెప్పింది ఈ బ్యూటీ. మరి ఫిజిక్ ని కాపాడుకునేందుకు ఎలాంటి డైట్ తీసుకుంటోంది?

“నాకు పర్సనల్ ట్రైనర్ ఉన్నాడు. ఎక్కువగా వర్కవుట్స్ చేస్తాను ఆ ట్రైనర్ చెప్పే పద్దతిలో. ఇక ఆహార నియమాలు అంటూ ఏమి లేవు. ప్రత్యేకమైన డైట్ కూడా తీసుకోను,” అని చెప్పింది ఈ భామ.

“కాకపోతే నేను ఎక్కువగా ఇంటి ఫుడ్ తీసుకుంటాను. ముంబైలో షూటింగ్ లో ఉంటే ఇంటి నుంచి ఫుడ్ వస్తుంది. హైదరాబాద్ లో కానీ ఇతర ప్రదేశాల్లో ఉంటే సమతుల్య ఆహరం ఉండేలా చూసుకుంటాను. తరాలుగా మా ఇంట్లో అందరూ తీసుకుంటున్న సగటు నార్త్ ఇండియన్ ఫుడ్ తీసుకుంటాను. కాకపోతే ఏది తిన్నా మితమే. పోషక విలువలు సరిగా ఉండేలా జాగ్రత్త పడుతాను,” అని వివరించింది.

ఆమె ఇప్పుడు “ఫ్యామిలీ స్టార్” సినిమా ప్రమోషన్ లో ఉంది. విజయ్ దేవరకొండతో కలిసి ప్రమోషన్ చేస్తోంది. ఈ సినిమా కథ, కథనాలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ బాగా నచ్చుతాయి అంటోంది.

Advertisement
 

More

Related Stories