అక్కడ కూడా క్రేజ్ ఎక్కువే!

“సీతారామం” సినిమాతో ఒక్కసారిగా తెలుగునాట పాపులర్ అయింది మృణాల్ ఠాకూర్. పాపులర్ అవడమే కాదు వరుసగా సినిమాల బిజీ అయింది. నాని, విజయ్ దేవరకొండ లతో సినిమాలు చేస్తోంది.

హీరోయిన్ గా బిజీగా ఉన్నా హిందీలో వెబ్ సిరీస్ లు మాత్రం ఆపడం లేదు. ఇప్పటికే భామ పలు వెబ్ డ్రామాస్ చేసింది. రీసెంట్ గా తమన్నాతో కలిసి “లస్ట్ స్టోరీస్ 2″లో నటించింది మృణాల్. ఇప్పుడు “మేడ్ ఇన్ హెవెన్ 2” అనే మరో వెబ్ సిరీస్ తో మనలని పలకరించనుంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు పెద్దగా ఆడడం లేదు. హిందీలో వెబ్ సిరీస్, వెబ్ డ్రామాలకు క్రేజ్ పెరుగుతోంది. అందుకే, పేరొందిన హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్ లు చేస్తున్నారు.

ఈ వెబ్ మార్కెట్ లో కూడా టాప్ లో ఉండాలనే ఉద్దేశంతో మృణాల్ ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు.

సినిమాకి మూడున్నర కోట్లు తీసుకునే ఈ భామ వెబ్ సిరీస్ లతో కూడా బాగానే సంపాదిస్తోంది. అలాగే యాడ్స్ తో కూడా సంపాదన ఎక్కువే.

Advertisement
 

More

Related Stories