ముఖచిత్రం ఫస్ట్ లుక్ విడుదల

- Advertisement -

వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ నటిస్తున్న చిత్రం… ముఖచిత్రం. దీని ఫస్ట్ లుక్ విడుదలైంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ‘కలర్ ఫొటో’ ప్రశంసలు అందుకున్న దర్శకుడు సందీప్ రాజ్ ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు.

కాల భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత SKN సమర్పణలో ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు.ఈ సినిమాతో గంగాధర్ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు.

ఫన్ అండ్ ఇంటెన్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఫస్ట్ లుక్ లో వికాస్ వశిష్ట, చైతన్య రావు, అయేషా ఖాన్ నిలబడి ఉండగా..ప్రియ వడ్లమాని రెండు పాత్రల్లో కనిపించడం ఆసక్తిని కలిగిస్తోంది.

 

More

Related Stories