ఆ కే(కి)సులో శిల్ప నిర్దోషి!

Richard Gere and Shilpa Shetty


15 ఏళ్ల క్రితం హాలీవుడ్ హీరో రిచర్డ్ గిర్ బాలీవుడ్ భామ శిల్పాశెట్టిని పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్నాడు. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించారని అప్పట్లో శిల్పపై కేసు నమోదయింది. ఇన్నేళ్ల తర్వాత ముంబై కోర్టు తుది తీర్పు ఇచ్చింది.

శిల్ప శెట్టిపై నమోదైన అసభ్యప్రవర్తన కేసులో ఆమె తప్పేమి లేదని ఈ రోజు కోర్టు తేల్చింది. ఈ కేసులో ఆమె బాధితురాలుగా చూడాలి అని పేర్కొంది. హాలీవుడ్ హీరో రిచర్డ్ గిర్ ని ఆమె ముద్దు పెట్టుకోలేదు. అతను కౌగిలించుకొని, ఆమెని ముద్దాడాడు. అది ముందుగా ప్లాన్ చేసింది కాదు అతను చేసిన చర్యకి శిల్పని ఎలా తప్పు పడుతారు అన్న ఆమె లాయర్ వాదనతో కోర్టు ఏకీభవించినట్లు ఉంది ఈ తీర్పు.

“ఆమె ప్రేరేపించింది అని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు,” అని కోర్టు ఈ కేసుని కొట్టివేసింది.

2007లో రాజస్థాన్లో జరిగిన ఒక ఈవెంట్ కి రిచర్డ్ గిర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ స్టేజ్ పై శిల్ప చెంపపై ముద్దు పెట్టుకున్నాడు ఆయన. అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. భారతీయ సంస్కృతిని శిల్ప మంటగలిపింది అంటూ ఆమె దిష్టి బొమ్మలను తగులబెట్టారు కల్చర్ యాక్టివిస్టులు. ఈ 15 ఏళ్ళల్లో చాలా మార్పులు వచ్చాయి. అందుకే, కోర్టు కూడా ఇది సిల్లీ కేసు అని క్లోజ్ చేసింది.

Advertisement
 

More

Related Stories