
మొత్తానికి పాయల్ ఘోష్ తను అనుకున్నది సాధించింది. ఆమె చేసిన కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ప్రభావం చూపించాయి. దర్శకుడు అనురాగ్ కశ్యప్ కు ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ మేరకు రేపు ఉదయం 11 గంటలకు ముంబయిలోని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో హాజరు కావాల్సిందిగా నోటీసులిచ్చారు.
2013లో అనురాగ్ తనను రేప్ చేయడానికి ట్రై చేశాడంటూ పాయల్ ఆరోపించింది. ఈ మేరకు ఆమె వరుసగా అనురాగ్ పై ట్వీట్స్ చేయడంతో పాటు.. పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. అనురాగ్ ఇంట్లో వీడియో లైబ్రరీ ఉందని, ఆ గదిలో సోఫాపై తనను పడుకోబెట్టి, ప్యాంట్ జిప్ విప్పాడని ఆమె ఆరోపించింది.
దీనిపై అప్పట్లోనే సీరియస్ గా స్పందించిన కశ్యప్.. పాయల్ ఆరోపణల్ని ఖండించాడు. లీగల్ గా ఈ కేసును ఎదుర్కోడానికి తను సిద్ధంగా ఉన్నానని కూడా తెలిపాడు. ఈ మేరకు అనురాగ్ కశ్యప్ తరఫు లాయర్ ప్రియాంక స్టేట్ మెంట్ ఇచ్చారు. పాయల్ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని, నిరాధారమైనవని కొట్టిపారేస్తున్నారు.
మరోవైపు పాయల్ మాత్రం తగ్గడం లేదు. ఈ ఇష్యూను ఆమె రాజకీయం చేయడానికే ఫిక్స్ అయింది. ఈ మేరకు ఆమె ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్ ను కలిసింది. రాజ్యసభ ఎంపీ రామ్ దాస్స అథ్వాలేను కూడా కలిసింది. ముంబయి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ను కూడా కలిసింది. ఈ నేపథ్యంలో అనురాగ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. 376, 354, 341, 342 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.