
పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తీసిన ‘గబ్బర్ సింగ్’ సినిమ బ్లాక్ బస్టర్. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ సినిమా మ్యూజికల్ గా కూడా సంచలనమే. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో ఇంకో సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే పేరు పెట్టారు. ఇప్పటికే 8 రోజుల పాటు కొంత చిత్రీకరణ కూడా జరిగింది.
లేటెస్ట్ గా పాటల సిట్టింగ్స్ మొదలుపెట్టినట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. హరీష్ శంకర్, దేవి శ్రీ ప్రసాద్ కూర్చొని మాట్లాడుకుంటున్న వీడియోని విడుదల చేసింది. సో, ఈ సినిమా కూడా మ్యూజికల్ గా సూపర్ గా ఉంటుంది అని ఎక్స్ పెక్ట్ చెయ్యొచ్చు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. ఒక భామగా శ్రీలీల ఇప్పటికే ఎంపికయింది. ఇంకో హీరోయిన్ ఎవరు అనేది త్వరలో చెప్తారు.
అలాగే, పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి తదుపరి డేట్స్ ఎప్పుడు ఇస్తాడో చూడాలి.