
ఆస్కార్ అవార్డు పోటీల్లో నిలిచారు ఎం.ఎం.కీరవాణి. అందుకే, నా పాట వరల్డ్ క్లాస్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు కీరవాణి.
“గతంలో నేను హిందీ సినిమాలకు పాటలు కంపోజ్ చేసేటప్పుడు హిందీ వాళ్లకు నచ్చే శైలిలో కంపోజ్ చేసేవాడిని. దక్షిణాది చిత్రాలకు వేరే విధంగా, హిందీ సినిమాలకు వేరే విధంగా ఉండేది నా స్వర రచన. కానీ, ఇప్పుడు ఆ తేడాలు లేవు. నేను వరల్డ్ మ్యూజిక్ అందిస్తున్నా. అందరికీ అన్ని ప్రాంతాలవారికి నచ్చుతుంది,” అని కీరవాణి అంటున్నారు.
ఇప్పుడు కీరవాణి పెద్దగా సినిమాలు చెయ్యడం లేదు. రాజమౌళి, రాఘవేంద్రరావు, క్రిష్ వంటి కొద్దిమంది దర్శకులకే ఆయన పాటలు ఇస్తున్నారు. మిగతా దర్శకులు కూడా ఆయన మనకి గొప్ప పాటలు ఇవ్వరులే అని దూరంగా ఉంటున్నారు.
ఇక కీరవాణి ఆస్కార్ అవార్డు వేదికపై తన “నాటు నాటు” పాటని లైవ్ గా పెర్ఫార్మ్ చేస్తారని టాక్.