‘నన్ను తప్పుగా చూపిస్తున్నారు’

హీరోయిన్ రష్మిక మందాన బాధ పడుతోంది. కొందరు కావాలనే తన మాటలను వక్రీకరిస్తున్నారు అనేది ఆమె ఆరోపణ. అలాగే, కొన్ని మీడియా సంస్థలు తనని తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనే చెప్తోంది.

ఆమె ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ఆమె చేసిన కామెంట్స్ కి కౌంటర్ గా సౌత్ ఇండియన్ ఫ్యాన్స్ రష్మికని ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే రకం అని విమర్శిస్తున్నారు.

బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ బాగుంటాయి అనే చెప్పే క్రమంలో సౌత్ ఇండియన్ సినిమాల్లో ఐటెం సాంగ్స్, మాస్ పాటలు తప్ప రొమాంటిక్ పాటలు ఉండవు అన్నట్లుగా ఆమె మాట్లాడింది. దక్షిణాది చిత్రపరిశ్రమను తక్కువ చేసి మాట్లాడిందని ఆమెపై తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల ఫ్యాన్స్ ఆమెపై మండిపడ్డారు.

దాంతో ఇప్పుడు ఆమె స్పందించింది. “నేను చెప్పింది ఎవరూ పూర్తిగా వినడం లేదు. నా మాటల్ని మధ్యలోనే కట్ చేసి వాటిని వైరల్ చేస్తున్నారు. అందుకే నా అభిప్రాయాలు తప్పుగా వెళ్తున్నాయి,” అని రష్మిక చెప్పింది.

Rashmika

అన్ని భాషల్లో నటిస్తూ బిజీగా ఉండడం వల్ల ఎక్కువ మంది శత్రువులు అయినట్లు కనిపిస్తోంది. రష్మికకి పాపులారిటీ పెరిగిన మాట వాస్తవమే కానీ మీడియాని, సోషల్ మీడియాని హ్యాండిల్ చెయ్యడంలో ఇబ్బంది పడుతోంది.

 

More

Related Stories