
ఉన్ని ముకుందన్ మలయాళంలో పేరున్న నటుడు. తెలుగు వారికి కూడా చిరపరిచితమే. అనుష్క సరసన ‘భాగమతి’లో నటించారు. ఇప్పుడు సమంతతో ‘యశోద’ చేశారు. నవంబర్ 11న విడుదల అవుతోంది యశోద. ఈ సందర్భంగా ఉన్ని ముకుందన్ చిట్ చాట్.
తెలుగులో ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు?
తెలుగులో మూడు సినిమాలు చేశాను. ఆ సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు ‘యశోద’లో సమంతతో కలిసి నటించా. ఆమె చాలా టాలెంటెడ్ యాక్టర్. మంచి సినిమా తీశాం.
‘యశోద’లో మిమ్మల్ని అంతగా ఆకట్టుకున్న అంశం ఏమిటి?
నా క్యారెక్టర్ గురించి ఎక్కువ చెప్పలేను. ఎందుకనేది మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది. నేను వెంటనే ఓకే చెప్పడానికి కారణం కూడా కథే.
సమంతతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
సమంత చాలా కష్టపడతారు. చాలా డేడికేటెడ్ గా ఉంటారు. ఫైట్స్ బాగా చేశారు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ చేశారు. సెట్‌లో ఇతర ఆర్టిస్టులతో చక్కగా మాట్లాడతారు.
ఇటీవల సమంత తనకు మైయోసిటిస్ ఉందని చెప్పారు. షూటింగ్ చేసేటప్పుడు మీకు తెలుసా?
షూటింగ్ చేసేటప్పుడు నాకు తెలియదు. సమంత చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నారు. తాను అలాంటి వ్యాధితో పోరాటం చేస్తున్నాని చెప్పలేదు. సమంత పోస్ట్ చూసి బాధపడ్డాను. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో మన ముందుకు వస్తారు.

తెలుగులో ‘ఆదిత్య 369’ వంటి గొప్ప సినిమా తీసిన నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్. ఆయన నిర్మాణంలో ‘యశోద’ చేయడం ఎలా ఉంది?
ఆయన చాలా హంబుల్ పర్సన్. వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఆయన గురించి చాలా తెలుసుకున్నాను. స్టోరీ లైన్, స్క్రిప్ట్‌లో ప్రతిదీ ఆయనకు తెలుసు.
సరోగసీ నేపథ్యంలో సినిమా తీశారు. సరోగసీపై మీ అభిప్రాయం ఏమిటి?
వ్యక్తిగత పరమైన అంశం అది. చట్టప్రకారం సరోగసీని ఆశ్రయించినప్పుడు ఎవరికి ఎటువంటి సమస్య ఉండదు. సరోగసీ అనేది చెప్పడం సులభమే. కానీ, అదొక ఎమోషనల్ జర్నీ. ఈజీగా దానిపై కామెంట్ చేయకూడదు.