
గడిచిన రెండేళ్లలో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో నివృతి సంస్థ 50కి పైగా మ్యూజిక్ వీడియో సాంగ్స్‌ను అందించింది నివృతి వైబ్స్. వీటిలో జరీ జరీ పంచెకట్టి.., గుంగులు, సిలక ముక్కుదానా, జంజీరే, వద్దన్నా గుండెల్లో సేరి వంటి పాటలు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి.
ఇప్పుడు నివృతి వైబ్స్ నుంచి మరో తెలంగాణ జానపద పాట మ్యూజిక్ వీడియోగా మన ముందుకు వచ్చింది. ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..’ అంటూ సాగే ఈ పాటలో జయతి ప్రధాన భూమికను పోషించింది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి…’ సాంగ్ కు సంగీత సారథ్యాన్ని అందించారు.
శ్రావణ భార్గవి అద్భుతంగా పాడిన ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.కాసర్ల శ్యామ్ మరోసారి తన పెన్ పవర్ ఎలా ఉంటుందో చూపించారు. జయతి విజన్స్ సమర్పణలో శ్రీకోనేటి ఈ పాటను డైరెక్ట్ చేశారు.
యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ డిజిటల్ మాధ్యమంలో ఒక బిలియన్ వ్యూస్ ఉన్న ఫ్లాట్‌ఫామ్స్ నివృతి వైబ్స్ సొంతం.
2024 పూర్తయ్యేసరికి 150 పైచిలుకు మ్యూజిక్ వీడియో సాంగ్స్‌ను అందించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు నివృతి వైబ్స్ సంస్థ తెలియజేశారు.