బంగార్రాజు నుంచి ‘నా కోసం’ రిలీజ్

Naa Kosam

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ… బంగార్రాజు. ఈ సినిమాని విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ‘నా కోసం’ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల అయింది. తన ప్రేయసి కృతి శెట్టి కోసం నాగ చైతన్య ఎంతలా తనని తాను మార్చుకున్నాడో ఈ పాటలో చెప్పారు.

అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ పాటని సిధ్ శ్రీరామ్ పాడాడు. నాగ చైతన్య, కృతి శెట్టిల మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించింది. ఈ పాట చివర్లో నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టిలు కనిపించారు.

అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. అందులో నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ఈ ‘బంగార్రాజు’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాత. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

 

More

Related Stories