అల్లరి నరేష్ మూవీ ప్రైమ్ లోనే!

- Advertisement -
Naandhi

అల్లరి నరేష్ నటిస్తున్న “నాంది” సినిమా ఓటిటి బాట పట్టనుందని తెలుగుసినిమా.కామ్ ఇంతకుముందే రాసింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే… ఈ సినిమాని డైరెక్ట్ గా స్ట్రీమ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ అంగీకరించిందట. భారీ మొత్తం ఇచ్చి ఈ మూవీ హక్కులను పొందింది. అంటే.. “నాంది” థియేటర్లో విడుదల కాదు. ముందుగా …. అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమ్ అవుద్ది.

అల్లరి నరేష్ తన రెగ్యులర్ స్టయిల్ కి భిన్నంగా చేసిన సినిమా ఇది. సీరియస్ రోల్, దానికి తోడు సబ్జెక్ట్ కూడా అలాంటిదే. కొత్త దర్శకుడు విజయ్ తీసిన ఈ మూవీ ట్రైలర్స్, టీజర్స్ అందర్నీ ఆకట్టుకుంది.

అల్లరి నరేష్ హీరోగా నటించిన రీసెంట్ సినిమాలేవీ ఆడలేదు. అందుకే, ఓటిటి రిలీజ్ అనేది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.

 

More

Related Stories