- Advertisement -

నాగచైతన్య హీరోగా నటించిన ‘థ్యాంక్యూ’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా పాటల ప్రచారం ఊపందుకొంది. తాజాగా “ఏంటో.. ఏంటేంటో.. నాలో ఏంటేంటో.. నాతో నువ్వేంటో..” అనే పాటని విడుదల చేశారు. ఈ మెలోడీ గీతాన్ని అనంత్ శ్రీరామ్ రాయగా తమన్ స్వరపర్చాడు.
ఈ పాటని మాళవిక నాయర్, నాగ చైతన్యపై చిత్రీకరించారు. ఈ సినిమాలో రాశిఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
‘మనం’ లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత విక్రమ్ కుమార్ నాగ చైతన్యతో తీస్తున్న మూవీ ఇది. దిల్‌రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథను అందించారు.