మరో యాంగిల్ చూపించిన నభా

నభా నటేష్ అందంగా ఉంటుందని తెలుసు. బాగా నటిస్తుందని, డాన్స్ కూడా చేస్తుందని తెలుసు. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఆమెలో ఓ బ్యూటీషియన్ ఉందనే విషయం కూడా తెలిసింది జనాలకు. ఇవి కాకుండా ఇప్పుడు తనలో మరో యాంగిల్ ను బయటపెట్టింది నభా. అద్భుతంగా పెయింటింగ్ తీసి అందరితో వావ్ అనిపించుకుంటోంది.

తనకెంతో ఇష్టమైన బ్యాట్ మేన్ బొమ్మ గీసింది నభా. ఈ బొమ్మ గీయడానికి తనకు 6-7 సెషన్స్ పట్టిందని చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ.. బ్యాట్ మేన్ పై తనకున్న ఇష్టాన్ని ఇలా బయటపెట్టింది. పెయింటింగ్ గీస్తున్నంత సేపు చాలా ఉల్లాసంగా అనిపించిందని, ఈ పెయింటింగ్ చూసి మీరు కూడా గర్వంగా ఫీల్ అవుతారంటూ పోస్టు పెట్టింది నభా.

లాక్ డౌన్ లో పూర్తిగా ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ.. ఆల్రెడీ సెట్స్ పైకి వచ్చేసింది. సాయితేజ్ హీరోగా నటిస్తున్న “సోలో బ్రతుకే సో బెటర్” సినిమాను పూర్తిచేసింది. ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్న “అల్లుడు అదుర్స్” సినిమాలో నటిస్తోంది.

Related Stories